ఏపీకి మూడు కొత్త మెడికల్‌ కాలేజీలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2020 4:25 PM GMT
ఏపీకి మూడు కొత్త మెడికల్‌ కాలేజీలు

ఏపీలో కొత్తగా మూడు మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి అమిత్‌ బిస్వాస్‌ ఓ ప్రకటన చేశారు. దీంతో మెడికల్‌ కాలేజీల నిర్మాణం ఎక్కడ చేపట్టనున్నారన్న మీమాంసకు తెరపడింది.

ఈ మేరకు గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల లేదా గురజాలలో ఒకటి, విశాఖ జిల్లాలోని పాడేరులో మరొకటి, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలలో కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కొక్క మెడికల్‌ కాలేజి నిర్మాణానికి రూ.325కోట్ల వ్యయం కానుంది. ఇందులో కేంద్రం ప్రభుత్వం రూ.195కోట్లు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రూ.130 కోట్లు భరించనుంది.Medical Colleges Sanctioned to AP

Next Story
Share it