మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ధర్మశాల వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే ఒక్క బాల్ పడకుండానే రద్దు అయ్యింది. నిన్న రాత్రి నుంచి వరుణుడు పలు దఫాలుగా వచ్చి పోతుండడంతో.. స్టేడియం అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. గ్రౌండ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా వరుణుడు అడ్డుపడుతుండడంతో మైదానాన్ని సిద్దం చేయలేకపోయారు. మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ కష్టమేనని తేల్చారు. పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా రెండో వన్డే మార్చి 12న ఆదివారం లక్నో వేదికగా జరగనుంది.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.