అడ్డుతగిలిన వరుణుడు.. టాస్‌ ఆలస్యం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 12 March 2020 2:12 PM IST

అడ్డుతగిలిన వరుణుడు.. టాస్‌ ఆలస్యం

అనుకున్నట్లుగానే భారత్‌, దక్షిణాఫ్రికా తొలి వన్డేకి వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో ధర్మశాల వేదికగా కాసేపట్లో ప్రారంభం కావాల్సిన తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. దీంతో టాస్‌ ఆలస్యం కానుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో ఒంటిగంటకు వేయాల్సిన టాస్‌ వాయిదా వేశారు. 1.15గంటలకు మైదానాన్ని పరిశీలిస్తామని అంపైర్లు ప్రకటించినా.. మళ్లీ వర్షం మొదలైంది. వర్షం రాకముందు మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు కొద్దిసేపు ప్రాక్టీస్‌ చేశారు.

మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు ఉండడంతో.. ఓవర్లను కుదించే అవకాశం ఉంది. వర్షం తగ్గకపోతే మాత్రం మ్యాచ్‌ రద్దయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి పిచ్‌తో పాటు మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో వర్షం కారణంగా భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ బంతి పడకుండానే రద్దైంది.

Next Story