'డిస్కోరాజా' వ‌చ్చేస్తున్నాడు.. ఇంత‌కీ.. ఎప్పుడు..?

By Medi Samrat  Published on  12 Oct 2019 12:52 PM GMT
డిస్కోరాజా వ‌చ్చేస్తున్నాడు.. ఇంత‌కీ.. ఎప్పుడు..?

మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ప‌వ‌ర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో ప్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వి. ఐ. ఆనంద్ దర్శ‌కత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ 'డిస్కో రాజా'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన 'డిస్కోరాజా' ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న 'డిస్కో రాజా' మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'డిస్కో రాజా' ను ఓ విజువల్ వండర్ గా రెడీ చేసేందుకు గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నారు.

థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీ, బాబీ సింహా క్యారెక్ట‌ర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతుంది అని టీమ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. డిసెంబ‌ర్ లో 'డిస్కోరాజా విడుద‌ల' కానున్నాడు. మ‌రి.. టీమ్ న‌మ్మ‌కం నిజం అవుతుందో లేదో చూద్దాం.

Next Story