నగర శివారులో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 5:22 AM GMT
నగర శివారులో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌: నగర శివారులోని నార్సింగి పుప్పాలగూడలో దారుణం జరిగింది. ముగ్గురు దుండగులు ఓ మహిళను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పుప్పాలగూడలో ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడ్డారు. మహిళ ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కి దుండగులు దారుణానికి ఒడిగట్టారు. దుండగుల నుంచి తప్పించుకోవడానికి మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేసింది. దీంతో స్థానికులు గుమిగూడటంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో స్థానికులు దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. స్థానికులకు ఒక దుండగుడు పట్టుబడగా పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు గాయాలపాలైన మహిళను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నారు.

Next Story