టోలిచౌకిలోని న్యూ మదీనా జూనియర్ కాలేజీ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మరియు డిస్టిక్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలిసి దాడి చేసి ఎనిమిది మంది మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. డిస్టిక్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జయప్రద తెలిపిన వివరాల మేరకు.. కాలేజీ యాజమాన్యాల అండదండలతో మాస్‌ కాపింగ్‌కు పాల్పడుతున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఈ దాడిని నిర్వహించినట్లు చెప్పారు.

మాస్‌ కాపింగ్‌కు ఒక్కో పేపర్‌కు ఐదు నుంచి ఎనిమిది వేలు విద్యార్థుల నుంచి వసూలు చేశారన్నారు. పరీక్ష రాసే సమయంలో మిగతా విద్యార్థులకు ఇచ్చినట్లు ఆ విద్యార్థులకు కూడా సమాధాన పత్రాలు ఇచ్చి పరీక్షా కేంద్రంలో కూర్చోబెడుతారని, డబ్బులు ఇచ్చిన విద్యార్థులు ఒరిజినల్‌ ఓఎంఆర్‌ షీట్లను కళాశాల ఉపాధ్యాయులతో రాయిస్తున్నారన్నారు. పరీక్ష చివరి సమయంలో విద్యార్థులకు అసలు ఆ ఓఎంఆర్‌ షీట్లను అందిస్తున్నారని తెలిపారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.