ముసుగు దొంగ హల్‌చల్‌.. వణుకుతున్న మంచిర్యాల ప్రజలు

By అంజి  Published on  14 March 2020 6:48 PM IST
ముసుగు దొంగ హల్‌చల్‌.. వణుకుతున్న మంచిర్యాల ప్రజలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ముసుగు దొంగ అర్థరాత్రి హల్‌చల్‌ చేశాడు. రాత్రి సమయంలో నస్పూర్‌లోని జగదాంబ కాలనీలో ఖాళీ రోడ్లపై ముసుగు దొంగ తిరుగుతుండగా రికార్డ్‌ అయిన సీసీ కెమెరా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముసుగు ధరించి, చేతిలో కత్తి పట్టుకొని ఇళ్ల వైపు చూస్తూ.. రెక్కీ నిర్వహించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. గత కొన్ని రోజులుగా నస్పూర్‌లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే ఆ దొంగతనాలకు పాల్పడింది ఇతనేని ప్రాథమిక సమాచారం.

రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నాడు. ముసుగు దొంగ కదలికలు సీసీ కెమెరా ద్వారా బయటకు రావడంతో స్థానికులు వణుకుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. దొంగను పట్టుకునేందుకు నస్పూర్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాత్రి సమయంలో బయటకు రావాలంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రామాల ప్రజలు వణుకుతున్నారు. దొంగను పట్టుకొవాలని పలువురు ప్రజలు పోలీసులను కోరారు. దొంగను పట్టుకునేందుకు పోలీసు ప్రత్యేక బృందం గాలిస్తోంది.

Next Story