వ్యూహాన్ని మార్చిన మారుతీ.. ఇప్పుడు దృష్టంతా దానిపైనే..!

By అంజి  Published on  16 Feb 2020 8:57 AM GMT
వ్యూహాన్ని మార్చిన మారుతీ.. ఇప్పుడు దృష్టంతా దానిపైనే..!

ఢిల్లీ: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అత్యధిక కార్లను ఉత్పత్తి చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటోంది. అయితే ఇప్పుడు మారుతీ సుజుకీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కొత్త పంతాలో నడిచేందుకు సిద్ధమైంది. ఇప్పుటి వరకు సెడాన్‌లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపై జైత్రయాత్ర కొనసాగించిన మారుతీ.. ఇప్పుడు తన దృష్టిని మళ్లీంచింది. చిన్న కార్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది.

గత జనవరిలో కార్ల తయారీ కంపెనీ మారుతీ మొత్తం 1,79,103 కార్లను ఉత్పత్తి చేసింది. ఇది గత ఏడాదితో పొలిస్తే 2.1 శాతం తక్కువ కావడం గమనార్హం. సెడాన్లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తిని తగ్గించిన మారుతీ.. చిన్నకార్ల ఉత్పత్తిని పెంచింది. ఈ ఒక్క జనవరిలోనే 34,288 కార్లను ఉత్పత్తి చేసింది. అయితే గతేడాది వీటి సంఖ్య 27,408గా ఉంది.

చిన్న కార్లైన ఆల్టో, ఎస్‌ప్రెస్సోల వాటా దాదాపు 25.10 శాతంగా ఉంది. కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్‌లో ఉత్పత్తి శాతం 6.31గా ఉంది. కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో డిజైర్‌, స్విఫ్ట్‌, బాలినో వంటివి ఉన్నాయి. కాగా త్వరలోనే బీఎస్‌6 మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. విటార బెజ్రా, ఎర్గిగా, ఎక్స్‌ఎల్‌6, ఎస్‌క్రాస్‌ మోడల్‌ కార్ల ఉత్పిత్తిలో 37.33 శాతం తగ్గుదల ఉంది. త్వరలోనే వీటిలో పెరుగుదల కనిపించవచ్చిన కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా ఇటీవల జరిగిన 2020 ఆటోఎక్స్‌పోలో తన సరికొత్త మోడల్‌ బీఎస్‌6 ఇగ్నీస్‌ మోడల్‌ను మారుతీ సుజుకీ ఆవిష్కరించింది. తాజాగా ఆ కారును లాంచ్‌ చేసింది. ప్రత్యేక ఫీచర్లు, స్టైలింగ్‌తో ఇగ్నీస్‌ అదరగొడుతోంది. భారత మార్కెట్‌లో బీఎస్‌6 మారుతీ సుజుకీ ఇగ్నీస్‌ ధర రూ.4.83 లక్షలుగా ఉంది.

Next Story