ఢిల్లీ: బీఎస్‌-6 ఇంజిన్‌ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చే సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన వాహనాలు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ వాహనాల తయారీ సంస్థలను కూడా బీఎస్‌-6 వాహనాలకు మారిపోవాలని ఆటో మొబైల్‌ డీలర్ల సంఘం కోరింది. కాగా బీఎస్‌-4 ఇంజిన్‌తో కూడిన వాహనాల అమ్మకాల గడువును పెంచబోమని సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే.

అమ్మకాల గడువు పెంచాలని కొరుతూ ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. పిటిషన్‌ను కొట్టి వేసింది. ఇప్పుడు తప్పనసరిగా బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేయాల్సి వస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. వాహన అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనల అమ్మకాలు.. షోరూమ్‌లకు కష్టతరంగా మారాయి. మార్చి 31 నాటికి బీఎస్‌-4 వాహనలను పూర్తిగా అమ్మడం.. కత్తి మీద సామే.

వాహనాలు, వాటి విడిభాగాల తయారీ దారులను పూర్తిగా బీఎస్‌-6 ప్రమాణాలతోనే తయారు చేయాలని కంపెనీలకు ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం సూచించింది. పూర్తిగా బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే డీలర్ల వద్దకు పంపాలని, బీఎస్‌-4 వాహనాల బిల్లంగ్‌లను ఎవరూ తీసుకోవద్దని సంఘం కోరింది. బీఎస్‌-4 వాహనాల అమ్మకాల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆశిష్‌ కాలే అన్నారు. మార్చి 31, 2020లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.