మారుతీరావు ఆస్తి విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..!

By సుభాష్  Published on  10 March 2020 1:42 PM IST
మారుతీరావు ఆస్తి విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..!

తెలంగాణలోని మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడైన మారుతీరావు రెండు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన మారుతీరావు.. ఆరునెలల కిందట బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆయన ఆస్తి వివరాలను కోర్టుకు అప్పగించారు. మారుతీరావు ఆస్తుల విలువను చూసి షాకవుతున్నారు.

ఇక మార్కెట్‌ విలువ ప్రకారం చూస్తే.. రూ. మొత్తం ఆయన ఆస్తి 200 కోట్లు ఉంటుందని వెల్లడించారు పోలీసులు. ముందుగా కిరోసిన్‌ డీలర్‌గా వ్యాపారి చేసిన మారుతీరావు తర్వాత రైస్‌మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. 15 సంవత్సరాల కిందట రైస్‌మిల్లు అమ్మి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. మిర్యాలగూడలో అమృత పేరుతో వంద పడకల ఆస్పత్రికి ఉంది. అలాగే పట్టణంలో మారుతీరావు భార్య గిరిజ పేరుపైన పది ఎకరాల భూమి ఉంది.

అంతేకాదు మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో 22 గుంటల భూమి ఉండగా, మిర్యాలగూడ, ఈదులగూడెం రోడ్డులో షాపింగ్‌మాల్స్‌, మారుతీరావు తల్లి పేరుపైన రెండంతస్తుల షాపింగ్‌మాల్‌ ఉంది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో 400 గజాల ప్లాట్‌, వేర్వేరు ప్రాంతాల్లో ఐదు అపార్టుమెంట్లున్నాయి. ఇక శరణ్య గ్రీన్‌ హోమ్స్‌ పేరుతో మారుతీరావు, అతడి సోదరుడు శ్రవణ్‌ దాదాపు వంద మిల్లుల వరకు అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Next Story