ప్రణయ్‌ హత్య కేసు.. 1200 పేజీల చార్జిషీట్‌.. అడ్డొచ్చిన కులం..

By అంజి  Published on  10 March 2020 6:43 AM GMT
ప్రణయ్‌ హత్య కేసు.. 1200 పేజీల చార్జిషీట్‌.. అడ్డొచ్చిన కులం..

నల్గొండ: మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసుకు సంబంధించి చార్జ్‌షీట్‌ను పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. ఇవాళ ప్రణయ్‌ హత్య కేసును నల్గొండ స్పెషల్‌ కోర్టు మరోసారి విచారించనున్నది. కాగా చార్జిషీట్‌లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. 2018 సెప్టెంబర్‌ 14న జరిగిన ప్రణయ్‌ హత్యపై 1200 పేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ప్రణయ్‌ హత్య కేసులో 102 మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు ఏ-1గా, శవ్రణ్‌ కుమార్‌ ఏ-6గా ఉన్నారు. ఫొరెన్సిక్‌ రిపోర్టును సైతం పోలీసులు కోర్టు ముందుంచారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కోర్టుకు తెలపనున్నారు. అమృత, ప్రణయ్‌ల ప్రేమ మొదలు నుంచి ప్రణయ్‌ హత్య వరకు చార్జిషీట్‌లో ప్రతి అంశాన్ని పోలీసులు పేర్కొన్నారు.

ప్రణయ్‌ హత్య సమయంలో అమృత ఇచ్చిన స్టేట్మెంట్‌..

తనకి స్కూల్‌లో చదువుతున్నప్పుడే ప్రణయ్‌తో పరిచయం ఉందని, మిర్యాలగూడ కాకతీయ స్కూల్‌లో తాను 9వ తరగతి చదువుతున్నప్పుడు, ప్రణయ్‌ 10వ తరగతి చదువుతున్నాడని, ఆసమయంలో మొదలైన స్నేహం.. కాస్తా ప్రేమగా మారిందని తెలిపింది. తామిద్దరం చనువుగా ఉండటం చూసి, ప్రణయ్‌ తక్కువ కులం వాడని, అతనితో మాట్లాడవొద్దని నాన్నా బెదిరించాడని పేర్కొంది. ఇంటర్‌ కూడా మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంచాడని, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో తాను ఇంకా ప్రణయ్‌తో మాట్లాడుతున్నానని తన తండ్రి డిస్‌కంటిన్యూ చేయించాడని చెప్పింది. మిర్యాలగూడ రాఘవ్‌ టాకీస్‌లో తాను, ప్రణయ్‌ సినిమాకి వెళ్లినప్పుడు తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌ అక్కడికి వచ్చి.. తనను ఇంటికి తీసుకువెళ్లి బాగా కొట్టారని వాపోయింది. ప్రణయ్‌ వాళ్ల తల్లిదండ్రులను పిలిచి బెదిరించారని, కొన్ని రోజులు ప్రణయ్‌ తనకు దూరంగా ఉన్నాడని అమృత చెప్పింది.

తాను ప్రణయ్‌తో మాట్లాడకుండా ఉండలేక పెళ్లి చేసుకుందాం.. లేదంటే చచ్చిపోదాం అని చెప్పానని, ప్రణయ్‌ అంగీకరించడంతో 2018 జనవరి 30న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో తాము పెళ్లి చేసుకున్న వివరించింది. మిర్యాలగూడలో తాను కనిపించలేదని నాన్న మారుతీరావు మిస్సింగ్ కేసు పెట్టాడని, ఆ తర్వాత పోలీసులు తనను, ప్రణయ్‌ మిర్యాలగూడ తీసుకొచ్చారని తెలిపింది. తాను, ప్రణయ్‌ మేజర్లు కావడంతో.. తాను ప్రణయ్‌ ఇంట్లో ఉంటా అని పోలీసులు చెప్పింది. 2018 ఆగస్టు 17న ప్రణయ్‌ తల్లిదండ్రులు తమ రిసెప్షన్‌ను గ్రాండ్‌ చేశారని తెలిపింది. అప్పటి నుంచి ప్రణయ్‌పై తన తండ్రి మారుతీరావు పగ పెంచుకున్నాడని, అంతం చేస్తానని హెచ్చరించడాని చెప్పుకొచ్చింది. 2018 సెప్టెంబర్‌ 14న హెల్త్‌ చెక్‌అప్‌ కోసం జ్యోతి హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలోనే ప్రణయ్‌ని హత్య చేశారని అమృత చెప్పింది.

Also Read: నిజామాబాద్‌లో దారుణం.. మహిళ కాలి వేళ్లను నరికి..

ప్రణయ్‌ హత్య కేసుపై మారుతీరావు స్మేట్మెంట్‌..

తమ కంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకొని కూతురు అమృత పరువు తీసిందని మారుతీరావు స్మేట్మెంట్‌ ఇచ్చాడు. సమాజంలో తల ఎత్తుకోలేకపోయానన్నారు. ఎన్నోసార్లు ప్రణయ్‌ని మర్చిపోవాలని అమృతకి చెప్పానని, అయిన వినలేదన్నారు. తమకు ఇష్టం లేకుండా హైదరాబాద్‌ వెళ్లి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. పెళ్లైన తర్వాత దగ్గరి బంధువులతో రాయబారం పంపినా తన కూతురు రాలేదన్నారు. అందుకే ప్రణయ్‌ని చంపాలి అనుకొని ప్లాన్‌ వేశానన్నారు. హత్యకు డబ్బు అవసరం అవుతుంది.. కాబాట్టి తమ్ముడ శ్రవణ్‌కి చెప్పి డబ్బు సమకూర్చాలని అడిగానని, ప్రణయ్‌ హత్య చేయించమని కిరాయి ఇచ్చానని తెలిపారు.

Next Story
Share it