కొండాపూర్‌లో వివాహిత ఆత్మహత్య..
By తోట వంశీ కుమార్ Published on 7 May 2020 4:42 PM IST
అపార్ట్ మెంట్ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకు ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొండాపూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని సుబ్బయ్య అర్చిల్డ్ అపార్ట్మెంట్ లో రాఘవేంద్రరావు, శేష సంతోష కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత ఫిబ్రవరి 15నే వివాహం జరిగింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కావడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో సంతోషకుమారి మనస్తాపానాకి గురైంది. బుధవారం తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story