వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదట.. అసలు విషయం తెలిసి డాక్టర్ మైండ్ బ్లాకైంది
By సుభాష్ Published on 25 Jun 2020 12:04 PM ISTఅప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే షాక్‌కు గురవుతుంటాము. ప్రస్తుత జనరేషన్‌లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? అని ముక్కునవేలేసుకుంటాము. కానీ నిజ జీవితంలో ఇలాంటివి కూడా జరుగుతాయా.? అంటే అలాంటివేమి ఉండవనే సమాధానం వస్తుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో సాంకేతికంగా అభివృద్ధి సాధించిన దేశాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగితే ఆశ్చర్యపోక తప్పదు. షాక్‌కు గురయ్యే సంఘటనను విని వైద్యురాలు సైతం బిత్తరపోయి మైండ్ బ్లాక్ అయ్యంత పని జరిగింది. సమాజంలో ఇప్పుడు ఇలాంటివాళ్లు కూడా ఉన్నారా..? అని పాపం ఆ డాక్టర్‌కు కొంత సేపు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ వింత సంఘటన తెలిసి మీరు కూడా ఇది నిజమే.. అని ఆశ్చర్యపోక తప్పదు.
వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన రాచెల్ అనే వైద్యురాలు వద్దకు ఓ కేసు వచ్చింది. తమకు పెళ్లాయి చాలా ఏళ్లు అవుతోందని, కానీ పిల్లలు పుట్టడం లేదని చెప్పడంతో వైద్యురాలు వారికి పలు పరీక్షలు నిర్వహించారు. అయితే రోజుకు మీరు ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటారని వైద్యురాలు రాచెల్ ఆ జంటను అడిగింది. దీంతో ఆ జంట చెప్పిన సమాధానం ఏంటంటే.. సెక్స్ అంటే ఏమిటి..? అది ఎలా ఉంటుంది..? అంటూ చెప్పారట. పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారని అనుకున్నామని.. మీరు రోజు ఎన్నిసార్లు కలుస్తున్నారు.. అని అడుగుతున్నారు.. అంటే ఏమిటి అని వైద్యురాలుకు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైందట. వారితో ఏం చెప్పాలో కొంత సేపు ఆశ్చర్యపోయిందట. పెళ్లయిన తర్వాత సెక్స్ చేయడం అంటే ఏమిటో తెలియని వాళ్లను చూసి ఇలాంటి వాళ్లు కూడా ఈ రోజుల్లో ఉన్నారా..?అని వైద్యురాలు బిత్తరపోయిందట. తర్వాత వారికి సెక్స్ పై అవగాహన కల్పించారు. అది అంటే ఎలా ఉంటుందో, ఇద్దరు భార్యభర్తలు కలవడం వల్ల ఏం జరుగుతుందో వారికి కౌన్సిలింగ్ రూపంలో అవగాహన కల్పించిట్లు సదరు వైద్యురాలు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సదరు వైద్యురాలు వయసు 59 సంవత్సరాలు. దాదాపు ఆమె 40 ఏళ్ల నుంచి వైద్య వృత్తిలో పని చేస్తున్నారు. నా వైద్య వృత్తిలో ఇలాంటి ఘటన షాక్‌కు గురి చేసేలా చేసిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న కాలంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? అనేది నమ్మలేని నిజం కదూ.