బస్టాండే.. బస్టాండే.. ఇక బతుకే బస్టాండే..
By Medi Samrat Published on 26 July 2020 6:26 PM ISTటాలీవుడ్ యువ హీరో నితిన్ చేస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. నితిన్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి. ఈ సినిమా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. లెజండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇదిలావుంటే.. జూలై 26న అంటే నేడు నితిన్ పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రంగ్‌దే చిత్ర బృందం నితిన్ అభిమానులకు ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లుగా చెబుతూ.. టైమ్‌ని కూడా ప్రకటించింది. చెప్పినట్లుగానే నితిన్‌కు, ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు చిత్రబృందం. ‘రంగ్‌దే’ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
టీజర్ ప్రకారం.. కీర్తిసురేష్ నితిన్ వెంట పడుతున్నా.. నితిన్ మాత్రం ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. కానీ కీర్తీనే పెళ్లి చేసుకోవాల్సి రావడం.. తాళికట్టే సందర్భంలో ఆమె నవ్వుతుండటం.. పెళ్లి తర్వాత ఇంటి పనులు నితిన్‌తో చేయించడం వంటివి చూపించారు. సరిగ్గా నితిన్ పెళ్లి రోజున.. పెళ్లి చేసుకుంటే తదనంతర పరిణామాలకు సింక్ అయ్యేలా ఉన్న ఈ టీజర్‌ను వదిలి అభిమానులకు, నితిన్‌కు మాంచి గిప్ట్ ఇచ్చిందనే చెప్పాలి చిత్రబృందం.