యువీకి వెన్నుపోటు పొడిచిన ధోని, కోహ్లీ
By తోట వంశీ కుమార్ Published on 6 May 2020 12:11 PM ISTటీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరు కలిసి వెన్నుపోటు పొడవడం వల్లే యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసిందని ఆరోపించాడు.
తాజాగా ఓ మీడియా ఇంటర్య్వూలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. యువరాజ్ సింగ్‌ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారని, అందులో ధోని, కోహ్లీ ఉన్నారని అన్నాడు. వీరిద్దరితో పాటు సెలెక్టర్ శరణ్‌దీప్ కూడా యువీకి మద్దుతు ఇవ్వకపోగా.. జట్టు నుంచి తప్పించాలని చూశాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. యువీ ఫామ్‌లోకి వస్తే ఎలా? అనే ఆందోళన అందరిలోనూ కనిపించేదని, అందుకనే యువీకి వెన్నుపోటు పొడిచారు. నిజంగా ఇది యువీని ఎంతగానో బాధించిందన్నారు.
యోగరాజ్ ఇలా ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలోను ఇలాంటి ఆరోపణలు చేశాడు. సురేశ్ రైనాకు ధోని మద్దతు ఎక్కువగా ఉండేదని, తుది జట్టులో రైనాను తీసుకోవడం కోసం యువరాజ్ ను తప్పించాలని చూశారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయం పై యువరాజ్ మాట్లాడుతూ.. ప్రపంచ కప్ సమయంలో రైనాకు ధోని మద్దతు ఉండేది.. కానీ.. నేను, యూసప్ ఫామ్‌లో ఉండడంతో రైనాను తుది జట్టులో తీసుకోవడంలో ధోని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నేను బాగా రాణిస్తుండడంతో పాటు జట్టులో ఏకైక లెఫ్ట్ ఆప్ స్నిన్నర్‌ని కావడంతో నన్ను తుది జట్టులోకి తీసుకోక తప్పలేదని వ్యాఖ్యానించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి ఇచ్చినంత మద్దతు తనకు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదని, తన ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ దాదానే అనే కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.