48 గంటల పాటూ.. ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో శవాన్ని ఉంచిన ఓ కుటుంబం..!
By సుభాష్ Published on 2 July 2020 2:11 PM ISTకోల్ కతా: కరోనా కారణంగా చోటుచేసుకుంటున్న మరణాల కారణంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నారు. కనీసం శవాలను పూడ్చడానికి, దహనసంస్కరాలకు కూడా కుటుంబ సభ్యులు నోచుకోలేకపోతున్నారు. ఈ ఘటనలను ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం.
తాజాగా కలకత్తా మహా నగరంలో 71 సంవత్సరాల వ్యక్తి కరోనా కారణంగా సోమవారం నాడు మరణించాడు. ఆ శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలంటే డెత్ సర్టిఫికెట్ తప్పకుండా కావాలని అధికారులు కోరారు. ఆ డెత్ సర్టిఫికెట్ రావడానికి రెండు రోజుల సమయం పట్టింది. దీంతో ఆ కుటుంబం 48 గంటల పాటూ ఆ శవం కూలిపోకుండా ఉండడానికి ఐస్ క్రీమ్ ఫ్రీజర్ ను రెంట్ కు తీసుకుని వచ్చారు.
సోమవారం నాడు ఆ వ్యక్తి చనిపోగా కుటుంబ సభ్యులు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు, సివిక్ ఆథారిటీస్, పోలీసులు, పొలిటీషియన్లకు ఫోన్ లు చేసినా ఎలాంటి ప్రయోజనం కూడా లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం ఐస్ క్రీమ్ ఫ్రీజర్ ను తీసుకుని వచ్చింది. అందులో ఆ డెడ్ బాడీని ఉంచారు. 48 గంటల తర్వాత అధికారులకు అన్ని సర్టిఫికెట్లు అందిన తర్వాత డెడ్ బాడీని అక్కడి నుండి శ్మశాన వాటికకు తరలించారు. ఆ వ్యక్తి చనిపోయిన 50 గంటలకు ఆ బిల్డింగ్ ను శానిటైజేషన్ చేశారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ పెద్దయన డాక్టర్ ను సంప్రదించాడు. కరోనా టెస్టులు కూడా చేయాలని వైద్యులను కోరాడు. అతడు తిరిగి ఇంటికి చేరుకునే సమయానికి అతడి ఆరోగ్యం పూర్తిగా నశించడంతో మరణించాడు. ఓ డాక్టర్ పిపిఈ సూట్ తో వారి ఇంటికి వచ్చాడు. అతడు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కరోనా వైరస్ కేస్ కావడంతో స్థానిక పోలీసులను సంప్రదించాలని కోరాడు. దీంతో అందరికీ కాల్స్ చేయడం మొదలుపెట్టారు కుటుంబ సభ్యులు. ఏ ఒక్కరు కూడా సరిగా స్పందించలేదు. దీంతో ఐస్ క్రీమ్ ఫ్రీజర్ ను తీసుకుని వచ్చిన అధికారులు శవాన్ని అందులో ఉంచారు. డెత్ సర్టిఫికెట్ 48 గంటల తర్వాత రావడంతో బుధవారం మధ్యాహ్నం కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు శవాన్ని దహనసంస్కారాలకు తీసుకుని వెళ్లారు.