ట్రిపుల్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన టీమిండియా ఆట‌గాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jan 2020 3:45 PM GMT
ట్రిపుల్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన టీమిండియా ఆట‌గాడు..!

రంజీ మ్యాచ్‌లో ఒక‌ప్ప‌టి టీమిండియా ఆట‌గాడు, బెంగాల్ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచ‌రీ బాదాడు. బెంగాల్ క్రికెట్ అకాడమీ వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో బెంగాల్ బ్యాట్స్‌మెన్ మనోజ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 10 గంటల 30 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన‌ మ‌నోజ్.. 414 బంతులు ఎదుర్కొని 30 ఫోర్లు, 5 సిక్సులతో 303 పరుగులు చేశాడు.

మ‌నోజ్ రాణించ‌డంతో బెంగాల్ 635 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. మనోజ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన వెంటనే బెంగాల్ ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన‌ హైదరాబాద్.. బెంగాల్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి.. 83 పరుగులు చేసింది. 2015లో భారత్‌ తరఫున చివరగా ఆడిన మనోజ్.. టీమిండియా తరఫున 12వన్డేలు, 3 టీ-20లు ఆడాడు. అలాగే.. ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో బెంగాల్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

Next Story