మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత

By సుభాష్  Published on  11 May 2020 2:48 AM GMT
మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నేత మన్మోహసింగ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గుండెకు సంబంధించిన వార్డుకు చేర్చారు. ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచామని, ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

ఆయన వయసు 87 సంవత్సరాలు. ఇప్పటికే ఆయనకు గుండెకు సంబంధించి పలు రకకాల ఆపరేషన్లు జరిగాయి. 1990లో మొదటిసారిగా మన్మోహన్‌సింగ్‌కు బైపాస్‌ సర్జరీ జరిగింది. 2009లో ఐదు బైపాస్‌ సర్జరీలతో కూడిన రెడో కార్డియాక్‌ సర్జరీ కూడా జరిగింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఆయనకు గుండెనొప్పి రావడంతో కాంగ్రెస్ నాయకులతో పాటు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కాగా, మన్మోహన్‌సింగ్‌కు సొంతంగా ప్రసంగాలు చేయడం వచ్చేది కాదు. ఆయన గొంతు చాలా సన్నగా ఉండేది. అందు వల్ల ఏదైన విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతారు. ప్రధానిగా కొనసాగిన సమయంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడాల్సి వస్తే మొదట ప్రాక్టీస్ చేసేవారట. 2004లో మొదటి సారిగా ఎర్రకోట నుంచి ప్రసంగం చేసేముందు బాగా ప్లాక్టీస్‌ చేశారట. అయితే క్రమ క్రమంగా చాలా ప్రసంగాలు చేయాల్సి వచ్చిన సమయంలో అలవాటై పోయి ఆ ప్రాక్టీస్‌ మానేశారట. ఆయనకు హిందీ కూడా వచ్చేది కాదు. ఆయన ప్రసంగాన్ని ఉర్దూలోగానీ, గుర్ముఖి లిపిలోగానీ రాసుకునేవారని, ప్రధానిగా ఉన్న సమయంలో మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్‌ బారు 'ది యాక్సిండెంటల్‌ ప్రైమినిస్టర్‌' అనే బుక్‌లో రాశారు.

Next Story