సమైక్య పాలకుల కుట్రతోనే మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం జరగలేదు: మంత్రి హరీష్ రావు

By సుభాష్  Published on  20 May 2020 11:58 AM GMT
సమైక్య పాలకుల కుట్రతోనే మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం జరగలేదు: మంత్రి హరీష్ రావు

సమైక్య పాలకుల కుట్రలతో మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మించడం కుదరలేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్‌ జిల్లాలోని హవెలి ఘన్‌పూర్‌ మండలం సర్ధన గ్రామంలో మంజీరా నదిపై చెక్‌ డ్యామ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందని అన్నారు. ఈ చెక్‌ డ్యామ్‌ను రూ.12.50 కోట్లతో నిర్మాణం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబిడ్డ అయినందున చెక్‌ డ్యామ్ నిర్మాణం కలం నెరవేరుతుందని అన్నారు. కళేశ్వరం నీళ్లు కొన్ని రోజుల్లోనే రానున్నాయని తెలిపారు. సర్ధన వద్ద చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగ ఉందన్నారు.

ఈ చెక్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల పాపన్నపేటలో మూడు గ్రామాలు, ఘనపురం మండలంలో రెండు గ్రామాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరా నదిపై దాదాపు 15 చెక్‌ డ్యామ్‌లు మంజూరు అయ్యాయని హరీష్ రావు గుర్తు చేశారు. మంజీరాపై చెక్‌ డ్యామ్‌లు నిర్మిస్తే.. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, , 25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీష్ రావు వివరించారు.

Next Story