ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఓ రిక్షా కార్మికుడిని కలిశారు. ఆ రిక్షా కార్మికుడు ఎవ‌రూ.. ఏమిటీ.? వివ‌రాలు తెలియాలంటే.. ఓ సారి మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఆ రిక్షా కార్మికుడి పేరు మంగల్‌ కేవత్‌.. ఇటీవల తన కుమార్తే వివాహానికి హాజరు కావాలని మోదీకి ఆహ్వాన‌ పత్రిక పంపాడు.

ఇక‌ మోదీకి కేవ‌త్ ఆహ్వానం అందడంతో.. పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు తెలుపుతూ మోదీ.. కేవత్‌కు లేఖ రాశాడు. ఈ నేఫ‌థ్యంలోనే వారణాసి పర్యటకు వచ్చిన మోదీ.. కేవత్‌ను పిలిపించుకుని.. అతనితో ముచ్చ‌టించారు. యోగక్షేమాలు అడిగారు.

మోదీని క‌లిసిన అనంత‌రం మంగల్‌ కేవత్‌ మాట్లాడుతూ.. నా కుమార్తె వివాహాం సంద‌ర్భంగా మొదటి ఆహ్వానాన్ని ప్రధాని మోదీకి పంపాను. ఢిల్లీలోని పీఎంవో కార్యాలయంలో ఫిబ్రవరి 8న‌ పెళ్లి పత్రికను ఇచ్చాను. అనంత‌రం.. మోదీ నుండి ఆశీస్సులు తెలుపుతూ లేఖ వచ్చింద‌ని.. లేఖను చూసిన వెంటనే తాము ఎంతో ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాన‌ని కేవత్ అన్నాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.