అయోధ్య తీర్పుపై స్పందించిన మంచు లక్ష్మీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 9:16 AM GMT
అయోధ్య తీర్పుపై స్పందించిన మంచు లక్ష్మీ

దశాబ్దాలుగా కొనసాగుతున్న రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి భారత అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. సీజేఐ రంజన్ గోగోయ్ నేతత్వంలోని జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ఏకగ్రీవ తీర్పు ఇచ్చారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పునిచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని కోర్పు తెలిపింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని తుదితీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. తాజాగా అయోధ్య తీర్పు నేపథ్యంలో మంచు ల‌క్ష్మీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. మ‌న‌ దేశంలో శాంతి, గౌర‌వం ప్ర‌బ‌లంగా ఉంది. భారతదేశాన్ని ఇతర దేశాల కంటే చాలా అందంగా తీర్చిదిద్దేది మ‌న దేశ వైవిధ్యం, సమగ్రత అని మంచు లక్ష్మీ ట్వీట్‌లో పేర్కొంది.

Next Story