స్కూల్‌ బస్సు బీభత్సం.. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో..

By సుభాష్  Published on  20 Feb 2020 2:40 PM GMT
స్కూల్‌ బస్సు బీభత్సం.. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో..

మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ స్కూల్‌ బస్సు బీభత్సం సృస్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఇతర వాహనాలపై దూసుకెళ్లింది. అయినప్పటికీ బస్సు ఎంతకీ ఆగకుండా కొంత దూరం వెళ్లి ఓ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సుతో పాటు యాక్టివా, ఆటో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే పలువురికి గాయాలయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని స్కూల్‌ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లను నియమించుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఉల్లంగించి బస్సులను ఏర్పాటు చేస్తున్నారని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story