కొడుకు పుట్టలేదని తండ్రి తన ముగ్గురు కూతుర్లను బావిలోకి తోసి హత్య చేసిన ఘటన గుజరాత్ లో జరిగింది. విషయంలోకి వెళ్తే రాశిక్ సోలంకి అనే వ్యక్తి జునాగఢ్ జిల్లా ఖంబాలియా లో ఉంటున్నాడు. తనకు అంజలి(7), రియా(5), జాల్ఫా(3) ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆర్దికపరంగా తన పరిస్థితి సరిగా లేకపోవడం వలన సోలంకి రోజు పనికి వెళ్తునే.. అధిక ఆదాయం కోసం గ్రామ రక్షణ దళంలో కూడా పనిచేస్తున్నాడు.

తన భార్యకు మరలా నాల్గవసారి ఆడ బిడ్డ పుట్టిందని. కొడుకు పుట్టలేదని కలత చెందిన సోలంకి తన ముగ్గురు కూతుర్లను తీసుకోనిపోయి పంట పొలంలో ఉన్న బావిలోకి తోసేసి హత్య చేశాడు. తరువాత తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆర్థిక స్థోమత సరిగా లేనందున వీరందరి పోషణ కష్టంగా మారడంతో మస్తాపానికి గురైన తను ఈ విధంగా చేసి ఉంటాడు అని పోలీసులు తెలిపారు.  ఆ సమయంలో సోలంకి భార్య తన తల్లి గారి ఇంటి దగ్గర ఉండటంతో ఈ దారుణం జరిగిందని తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.