తండ్రిని హతమార్చిన కొడుకులు.. కారణం తెలిస్తే షాకు..

By సుభాష్  Published on  9 Feb 2020 3:43 PM GMT
తండ్రిని హతమార్చిన కొడుకులు.. కారణం తెలిస్తే షాకు..

రోజురోజుకు మానవత్వం మంటగలుస్తోంది. పలువురు రోజురోజుకు దిగజారిపోతున్నారు. మద్యానికి బానిసైన తాగుబోతులు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. కనిపెంచి పెద్ద చేసిన తండ్రినే కొడుకులు దారుణంగా హతమారుస్తున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు నీడలా వెన్నంటి ఉండే తండ్రిని సైతం దారుణంగా చంపేస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు.

కన్న తండ్రినే అతి దారుణంగా హతమార్చిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో తండ్రిని ఇద్దరు కొడుకులు కర్రలతో దారుణంగా చితకబాదాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తండ్రిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్రాస్‌ జిల్లాకు చెందిర రాజ్‌పాల్‌ (50) వివిధ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లి రూ. 20వేలు డ్రా చేసుకుని వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాజ్‌పాల్‌ ఇద్దరు కొడుకులు డబ్బులు కావాలని అడిగారు. అందుకు తండ్రి డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇద్దరు కొడుకులు తండ్రిని కర్రలతో తీవ్రంగా చితకబాదారు. గాయాలతో ఆస్పత్రిలో చేరిన తండ్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. తండ్రి చావుకు కారణమైన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యానేరం, దాడి, తదితర సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it