నిజ నిర్ధారణ: ఎర్రచొక్కాలో ఢిల్లీ పోలీసులతో కలిసి విద్యార్ధులపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తా?
By సత్య ప్రియ Published on 18 Dec 2019 2:27 AM GMTపౌరసత్వ చట్ట సవరణ బిల్లు పై వ్యతిరేకతదేశ రాజధాని కి పాకింది. ఢిల్లీ లోని జామియా యూనివర్సిటి లో విద్యార్ధులపై ఢిల్లీ పోలీసులు చేసిన దాడి దేశంలో అలజడి సృష్టిస్తోంది.
ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు,చిత్రాలు సోషల్ మీడియా లో తిరుగుతున్నాయి.జామియా విద్యార్ధి ని పోలీసులు కొడుతుంటే, విద్యార్ధినులు అతని చుట్టూ చేరి అతనిని కాపాడే వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
అయితే, ఇందులో పోలీసులు అందరూ యూనిఫార్మ్ వేసుకొని వుండగా, ఒకరు మాత్రం ఎర్ర టి షర్ట్, జీన్స్ వేసుకొనిఉన్నారు. ట్విట్టర్ లో కొందరు అతను పోలీసు కాదనీ, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారం లో అతని పేరు భరత శర్మ అని,అతను ఏబివిపి, ఆరెసెస్ కార్యకర్త అని, ఢిల్లీయూనివర్సిటి విద్యార్ధి అంటూ రెండు చిత్రాలు షేర్ చేయబడ్డాయి.
నిజ నిర్ధారణ:
ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఈ వార్తలను తోసి పుచ్చారు. ఎర్ర ట్ షర్ట్, జీన్స్వేసుకున్న వ్యక్తి ఆంటి ఆటొ తెఫ్ట్ స్క్వాడ్ (AATS) లో పోలీసు కానిస్టేబల్ అని నిర్చారించారు. సుమారు 30 ఏళ్ల పైన వయసు ఉండే ఈ కానిస్టేబల్ పేరును భద్రతా కారణాల దృష్ట్యా ప్రకటించడానికి అధికారులు నిరాకరించారు.
పైన ట్వీట్ కి సమాధానంగా వేరొక ట్విట్టర్ వినియోగదారుడు మరో వీడియో ను షేర్ చేసాడు. అందులో ఒక విద్యార్ధి తోటి విద్యార్ధులను కొట్టడం మనం చూడొచ్చు. అతనే భరత శర్మ అని… అతను, డిల్లీ పోలీసులతో కలిసి లాఠీ చార్జి చేసిన వ్యక్తి ఒకరే అంటూ ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ ప్రచారానికి ఢిల్లీ పోలీస్స్పందిస్తూ, ఈ వీడీయోలోని వ్యక్తి,ఢిల్లీ పోలీస్ తో ఉన్న వ్యక్తి ఒకరు కాదనీ, ఇతను ఎవరో... ఇలా ఎందుకు చేస్తున్నాడో విచారణ జరుపుతున్నామని తెలిపింది.
అయితే, ప్రచారం జరుగుతున్నట్టు జీన్స్, టీషర్ట్ వేసుకొని ఢిల్లీ పోలీసులతో కలిసి లాఠీ చార్జిలో పాల్గొన్నవ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనేది తప్పుడు ప్రచారం. అతను ఆంటీ ఆటో తెఫ్ట్ స్క్వాడ్ కి చెందిన ఒక కానిస్టేబల్.