యువకుడు క్వారంటైన్ నుంచి పరారై ప్రియురాలి ఇంటికి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!
By సుభాష్ Published on 27 March 2020 3:09 PM GMTకరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు విధించినా.. కొందరికి ఏ మాత్రం చెవికెక్కడం లేదు. నిబంధనలను ఉల్లంఘించి తమ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడిని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తే.. ఆ యువకుడు అక్కడి నుంచి పరారైన సంఘటన తమిళనాడు చోటు చేసుకుంది. చివరకు అతన్ని పట్టుకుని ఇలా ఎందుకు చేశావని, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే యువకుడు చెప్పిన సమాధానాన్ని విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. క్వారంటైన్ నుంచి నేరుగా తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఇక పోలీసులు గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు అతన్ని క్వారంటైన్‌కు తరలించారు.
మధురైకి చెందిన 24 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడు. కరోనా వైరస్ కారణంగా అతనిని అధికారులు మధురైలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆ యువకుడు క్యారంటైన్ నుంచి వెళ్లిపోయాడు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు బయటకు వెళ్లకుండా ఉండాలని, కరోనా లక్షణాలు లేకున్నా ఐసోలేషన్‌లోనే ఉండాలని నిబంధనలు విధించినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా యువకుడు పారిపోయాడు. దీంతో పోలీసులు యువకుని కోసం ముమ్మరంగా గాలించగా, శివగంగ జిల్లాలోని ప్రియురాలి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే సదరు యువకున్ని పట్టుకుని విచారించగా, ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రేమకు ప్రియురాలి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, అందుకే ప్రియురాలిని కలిసేందుకు వెళ్లానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.Also Read
అమెరికాను వెంటాడుతున్న ‘కరోనా’Next Story