పశ్చిమ బెంగాల్: సీఎం మమతా బెనర్జీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారన్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున రెడ్మీల్‌పై నడకతో రోజును ప్రారంభిస్తారు మమత. తొలిసారిగా డార్జిలింగ్‌ కొండలపై మమత ఉత్సాహంగా జాగింగ్‌ చేశారు. ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ క్లైమేట్‌ యాక్షన్‌’ సందర్భంగా ఏకంగా పది కిలోమీటర్ల జాగింగ్‌ చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. డార్జిలింగ్‌లోని కూర్సేయాంగ్‌ నుంచి పరుగు ప్రారంభించారు. స్థానికులతో పలు విషయాలు మాట్లాడుతూ రన్ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కర్భన ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలను మమత ప్రస్తావించారు.

జాగింగ్ చేస్తున్న సమయంలో మమత వెంట ఆమె భద్రతా సిబ్బందితో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. “మన భూ గ్రహాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిఙ్ఞ చేద్దాం. పచ్చదనాన్ని కాపాడండి. పరిశుభ్రంగా ఉండండి’అని మమత పిలుపునిచ్చారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.