హైదరాబాద్‌లో రౌడీషీటర్‌ దారుణ హత్య

By సుభాష్  Published on  5 Sept 2020 11:18 AM IST
హైదరాబాద్‌లో రౌడీషీటర్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మైలార్‌దేవునిపల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అన్సారీరోడ్‌లో నివాసం ఉండే రౌడీషీటర్‌ జాడు జావెద్‌ (33)కు ఇతర రౌడీషీటర్లకు గొడవలు ఉన్నాయి. కొంత కాలంగా ఒంటరిగా కనిపిస్తున్న జావెద్‌ పై నిఘా పెట్టిన ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి వెంబడించి దాడి చేశారు. తలపై ఏకంగా 12 కత్తి పొట్లు పొడిచి దారుణ హత్య చేసినట్లు ఎస్సై తెలిపారు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతన్ని కొందరు స్నేహితులు ఆప్పత్రికి తరలిస్తుండగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పడుతున్నారు.

Next Story