బిగ్‌బాస్‌-4 : షో హోస్ట్‌గా మహేశ్‌ బాబు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2020 5:02 PM IST
బిగ్‌బాస్‌-4 : షో హోస్ట్‌గా మహేశ్‌ బాబు..!

బిగ్‌బాస్‌ కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషలతో సంబంధం లేకుండా బుల్లితెరపై అన్ని ప్రాంతాల్లో దూసుకెలుతుంది. ఇక తెలుగులో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ వైపు అడుగులు వేస్తోంది. నాలుగో సీజన్‌ మొదలు కావడానికి 4 నెలలకు పైగానే సమయం ఉంది.

ఇదిగా ఉంటే.. మొదటి సీజన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండో సీజన్‌లో నాని వ్యాఖ్యాతగా తన సత్తా చాటాడు. ఇక మూడో సీజన్‌లో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున అడుగుపెట్టి షోను మరింత రసవత్తరంగా మలిచాడు. కాగా నాలుగో సీజన్‌ను ఎవరు హోస్ట్‌ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మొదటి సీజన్‌ ను తనదైన శైలిలో రక్తి కట్టించాడు. తెలుగు ఆడియన్స్‌కి ఏ మాత్రం తెలియని ఈ రియాల్టీ షోను తన స్టామినాతో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ చేసాడు. ఎన్టీఆర్ రేంజ్‌లో కాకపోయినా.. నాని కూడా రెండో సీజన్‌ను బాగానే సక్సెస్ చేసాడు. ఇక మూడో సీజన్ నాగార్జున హోస్ట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. కానీ తొలి రెండు సీజన్స్‌తో పోలిస్తే మూడో సీజన్ మాత్రం కచ్చితంగా రేటింగ్స్‌లో చాలా వరకు డౌన్ అయింది. మొదట్లో బాగానే వచ్చినా తర్వాత మాత్రం బాగా పడిపోయింది. దాంతో నాలుగో సీజన్ కోసం మరోసారి హోస్ట్ కోసం వేట మొదలుపెట్టారు నిర్వాహకులు.

మొదటి సీజన్‌ను సూపర్‌ సక్సెస్ చేసిన ఎన్టీఆర్‌నే నాలుగో సీజన్‌ హోస్ట్‌గా చేమయని.. ఎన్టీఆర్‌ని స్టార్‌ మా యాజమాన్యం సంప్రదించిందట. అయితే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఇందుకు తారక్‌ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై కనిపించడానికి ఈ సూపర్‌ స్టార్‌ ఆస​క్తిని కనబరుస్తున్నారు.

బిగ్‌బాస్‌ వ్యాఖ్యాతగా అలరించేందుకు మహేష్‌ సన్నద్ధమవుతన్నట్లు, అందులో భాగంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాతలు ఎలాంటి అధికారిక సమాచారాన్ని ప్రకటించలేదు. అలాగే గత సీజన్ల కంటే సీజన్‌4 భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ 3ని, బిగ్‌బాస్‌ 2కు జిరాక్స్‌ కాపీగా మలిచారన్న విమర్శలు రావడంతో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అందుకోసం షో ఫార్మాట్లను కూడా మార్చుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఏదేమైనా కూడా మహేష్ వస్తే మాత్రం షో కొత్తగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story