కరోనాను కట్టడి చేసేందుకు మహేష్ ఆరు సూత్రాలు
By రాణి Published on 25 March 2020 7:22 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు తన అభిమానులకు, తెలుగు ప్రజలందరికీ శ్రీశాశ్వరి నామ ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా కరోనా నుంచి జాగ్రత్తగా ఉండేందుకు 6 జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని తెలిపారు.
Also Read : జొమాటో ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్
'' అందరికీ ఉగాది శుభాకాంక్షలు !!
ఇలాంటి విపరీత పరిస్థితుల్లో #FightAgainstCoronavirus గురించి మీ అందరికీ ఈ 6 విలువైన నియమాలను పాటించమని కోరుతున్నాను.
1. మొదటిది, అతి ముఖ్యమైనది ఇంట్లోనే ఉండండి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.
2. ఏదైనా తాకితే కనీసం 20/30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి.
3. మీ ముఖాన్ని, ముఖ్యంగా కళ్ళు, నోరు మరియు ముక్కును తాకకుండా ఉండండి. మీ నోటిని, ముఖాన్ని, ముక్కుని తాకవద్దు.
4. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి.
5. #SocialDistancing యొక్క అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.
6. మీకు కరోనా లక్షణాలు లేదా అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్'ని వాడండి. మీకు COVID-19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని లేదా క్లినిక్‌ని సంప్రదించండి.
Also Read : పేదలను ఆదుకునేందుకు విరాళాలిచ్చిన రీ(య)ల్ హీరోలు
సరైన వనరుల నుండి మంచి సమాచారం మరియు నమ్మకమైన సమాచారాన్ని కలిగి ఉండండి. ప్రార్ధిద్దాం, మంచిని ఆశిద్దాం మరియు కలసికట్టుగా ఈ యుద్దాన్ని గెలుద్దాం ❤ #StayHomeStaySafe🙏🏻.'' అని మహేష్ ట్వీట్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ట్వీట్ కు నెటిజన్లు బాగానే స్పందించారు. '' అలాగే అన్న మీరు చెప్పినట్లే జాగ్రత్తలు పాటిస్తాం ''. అని రిప్లైలు ఇస్తున్నారు.
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 562 కరోనా కేసులు నమోదవ్వగా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 39కి పెరిగింది. మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 19వేలకు పైగానే నమోదైంది.