'సామ్నా'లో స్వరం పెంచిన శివసేన..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల కీ శివసేన దగ్గరే ఉంది. ఉన్నట్లుండి..శివసేన స్వరం మార్చి, పెంచింది. తమ మౌత్ పీస్ లో సామ్నాలో బీజేపీపై విరుచుకుపడింది. ఆర్ధక మందగమనానికి బీజేపీయే కారణమంటూ ఓ ఆర్టికల్ రాసింది. ఫలితాలు వచ్చిన రోజు నుంచి శివసేన, బీజేపీ గుంభనంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి బీజేపీ విధానాలే కారణమంటూ సామ్నాలో మండిపడింది శివసేన. దీనికి బీజేపీనే బాధ్యత వహించాలన్నది. ప్రతి దీపావళి పండుగ నాడు కళకళలాడే దేశీయ మార్కెట్‌లు వెలవెలబోయాయంటూ విమర్శలు గుప్పించింది. దీనికి కారణాలు బీజేపీ తెలుసుకోవాలని పేర్కొంది. ఆదివారం నుంచి వేడెక్కిన రాజకీయాలు ఈ ఆర్టికల్‌తో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ కథనం రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీని డిఫెన్స్‌లో పడేయడానికే శివసేన ఆర్టికల్ రాసుకొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
సీఎం పదవి కాలాన్ని పంచుకోవాలని శివసేన ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే..బీజేపీ పెద్దలు లోలోన మాట్లాడుకుంటున్నప్పటికీ..ఈ విషయంపై పెదవి విప్పడం లేదు.బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌ను కలిశారు, శివసేన నేత దివాకర్ రౌత్ గవర్నర్‌తో భేటీ అయ్యారు.