మహారాష్ట్ర-హర్యానా ఎన్నికలు- సెలబ్రిటీల సందడి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 2:57 PM GMT
మహారాష్ట్ర-హర్యానా ఎన్నికలు- సెలబ్రిటీల సందడి..!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సెలబ్రిటీలు సందడి చేశారు. పోలింగ్‌కు రాజకీయ, సినీ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు పోటెత్తారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర విషయానికి వస్తే... ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, భార్య అమృతతో కలసి ఓటు వేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లు నాగపూర్‌లో ఓటు వేశారు. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే భార్య రెష్మి, కుమారులు ఆదిత్య ఠాక్రే, తేజస్ ఠాక్రేలు బాంద్రా ఈస్ట్‌లో ఓటు హక్కు వినియో గించుకున్నారు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఆదిత్య ఠాక్రే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ముంబై వర్లి నుంచి ఆయన బరిలోకి దిగారు. ఓటు వేసేముందు సిద్ధి వినాయక ఆలయంలో ఆదిత్య ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేకి నివాళులు అర్పించారు.

Thakarey Famly

Raj Thackeray

MNS చీఫ్ రాజ్‌ థాక్రే కుటుంబ సభ్యులతో కలిసి శివాజీపార్క్ ప్రాంతంలోని బాల్‌మోహన్ స్కూల్‌లో ఓటు వేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దక్షిణ ముంబైలో ఓటు వేశారు. అల్లుడు సదానంద్ సూలే, మనవరాలు రేవతితో కలిసి పవార్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పవార్ కుమార్తె సుప్రియా సూలే తారామతిలో ఓటు వేశారు. NCP సీనియర్ నేత ప్రఫుల్‌ పటేల్.. గోండియా అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలు ఊహించి చెప్పడానికి తాను జ్యోతిష్యుడిని కాదని పవార్ అన్నారు.

Maharashtra Haryana Assembly Elections 2019 Polling Update - Sakshi

మహా ఎన్నికల్లో బీటౌన్ సందడి చేసింది. ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఓటు వేశారు. మాజీ న‌టుడు ప్రేమ్ చోప్రా, దర్శక-చ‌యిత గుల్జార్‌లు బాంద్రాలోని పోలింగ్ బూత్‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అమీర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌ రావు, హీరోయిన్లు మాధురీ దీక్షిత్, ప్రీతి జింటా, దియా మీర్జా, హీరోలు వరుణ్ ధావన్, గోవిందా, జాన్ అబ్రహం, ఖైలాష్ ఖేర్, డైరెక్టర్ సుభాష్ ఘయ్‌లు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, భార్య జెనీలియాతో కలిసి లాతూర్‌లో ఓటు వేశారు. రితేష్ సోదరులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్‌లు కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమారుడు అర్జున్‌లు వెస్ట్ బాంద్రాలో ఓటు వేయగా మాజీ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, ఆయన భార్య లారా దత్తాలు కూడా బాంద్రాలోనే ఓటు వేశారు. బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్ అంధే రీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

B4

Jeniliya

B3

Maharashtra Haryana Assembly Elections 2019 Polling Update - Sakshi

హర్యానా విషయానికి వస్తే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వచ్చారు. దాంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. కర్నాల్‌లో ఓటు వేసిన సీఎం, మరోసారి తానే పగ్గాలు చేపడతానని ధీమాగా చెప్పారు. జేజేపీ లీడర్ దుష్యంత్ చౌతాలా తన కుటుంబంతో కలసి ట్రాక్టర్‌లో వచ్చి సిర్సాలో ఓటు వేశారు. హర్యానా పీసీసీ అధ్యక్షురాలు కుమారి షెల్జా, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Maharashtra Haryana Assembly Elections 2019 Polling Update - Sakshi

హర్యానా ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒలంపిక్ విజేత, బీజేపీ అభ్యర్థి యోగేశ్వర్‌దత్ బరోడాలో ఓటు వేశారు. రెజ్లర్, బీజేపీ అభ్యర్థి బబితా ఫొగట్ కుటుంబ సభ్యులతో కలసి చర్కీదాద్రీ నియోజకవర్గంలోని ఓటు హక్కు వినియోగించుకున్నారు. టిక్‌టాక్ స్టార్, బీజేపీ అభ్యర్థి సొనాలి ఫోగట్ ఆడంపూర్ నియోజకవర్గంలో ఓటు వేశారు.

Next Story