• మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారు
  • సెప్టెంబర్ 27న నోటిఫికేషన్, అక్టోబర్ 21న ఎన్నికలు, అక్టోబర్ 24 ఫలితాలు

ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ తేదీలను ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానాల్లో అక్టోబర్ 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు ప్రకటిస్తారు. ఇక రెండు రాష్ట్రాల ఎన్నికలకు సెప్టెంబర్‌ 27న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని సీఈసీ ప్రకటించింది.
మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో 8.94కోట్ల ఓటర్లు, హర్యానాలో కోటి 28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్రలో 1.8లక్షల ఈవీఎంలు, హర్యానాలో లక్షా 30వేల ఈవీఎంలు వాడనున్నారు. ఎన్నికల అబ్జర్వర్లు ఉంటారని సీఈసీ స్పష్టం చేసింది. ఇక..నవంబర్‌2తో హర్యానా అసెంబ్లీ గడువు, నవంబర్9తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.