మహారాష్ట్ర సీఎం కాన్వాయిపై మహిళ సిరా దాడి
By న్యూస్‌మీటర్ తెలుగు
అహ్మద్‌నగర్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధికారిక కాన్వాయ్‌పై అహ్మద్‌నగర్‌లో శుక్రవారం సిరా దాడి జరిగింది. ఆయన కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరు కాడానికి , పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వెళుతుండగా అహ్మద్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది
స్థానిక పోలీసుల ప్రాధమిక నివేదిక ప్రకారం ..సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కాన్వాయ్‌పై సిరా విసిరిన మహిళ షర్మిలా యోయోల్‌గా గుర్తించారు. రాజు శెట్టి పార్టీ అయిన స్వాభిమాని శెట్కారి సంఘటాన్ సభ్యురాలు షర్మిల.
ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు షర్మిలా యోయోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రైతులపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్న యోయోల్ నిరసన తెలిపేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే షర్మిలను విడుదల చేశారు. ఆమెపై ఎటువంటి కేసులుగాని, చర్యలు తీసుకోలేమంటూ పోలీసు వర్గాలు తెలిపాయి.
సిరా దాడిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు . ఈ దాడి తరువాత కూడా సీఎం తన అహ్మద్‌నగర్ పర్యటనను కొనసాగించారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి గౌరవం వందనం చేయడం ద్వారా తన ‘మహా జనదేశ్ యాత్ర’ ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికలకు ముందు సాధ్యంమైనంత వరకు ప్రజలను కలుసుకోడమే యాత్ర ముఖ్య ఉద్దేశం.