ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
By సుభాష్ Published on 3 Feb 2020 3:38 PM IST
మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జలగావ్ జిల్లా యావల్ తాలుకాలోని హింగోలా ప్రాంతంలో ఎస్‌వీయూ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, బంధువుల వివాహానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. కాగా, గత నెల 25న మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొన్న సంఘటనలో 26 మంది మృతి చెందగా, 30 మందివరకు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story