మహారాష్ట్రలో 9566 మంది పోలీసులకు కరోనా..!

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 2 Aug 2020 5:25 PM IST

మహారాష్ట్రలో 9566 మంది పోలీసులకు కరోనా..!

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇక మహారాష్ట్రలో విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 9600 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 322 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి మహారాష్ట్రలో కేసుల సంఖ్య 4లక్షల 31వేలు దాటింది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 15,316 మంది మరణించారు.

ఇదిలా ఉంటే.. కరోనా ఎదుర్కోవడంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉంటూ విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు ఈ మహమ్మారి భారీన పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,566 మంది పోలీసులకు కరోనా సోకినట్లు సంబంధిత అధికారలు వెల్లడించారు. కరోనా కారణంగా 103 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సిబ్బందిలో 7,534 మంది ఇప్పటికే కోలుకోగా.. మరో 1929 మంది పోలీసులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ముంబాయితో పాటు పుణె వంటి నగరాల్లో ఈ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది.

Next Story