ఆరేళ్ల చిన్నారిపై దారుణం: కళ్లు పీకి.. అత్యాచారం

By సుభాష్  Published on  23 April 2020 1:08 PM GMT
ఆరేళ్ల చిన్నారిపై దారుణం: కళ్లు పీకి.. అత్యాచారం

దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా.. ప్రభుత్వాలు, పోలీసులు ఎలాంటి కఠినంగా వ్యవహరించినా దారుణాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో హత్యలు, అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో ఓ కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారి కళ్లు పీకి..అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దామోకు చెందిన ఆరేళ్ల చిన్నారి ఇంటికి కొద్ది దూరంలో స్నేహితులతో ఆడుకుంటోంది. అదే సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అప్పటి నుంచి పాప కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పాప ఆచూకీ కోసం గాలించారు. కాగా, గురువారం ఉదయం ఇంటికి కొంత దూరంగా తీవ్ర గాయాలతో పడి ఉన్న పాపను గుర్తించారు.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తి పాపపై అత్యాచారం చేశాడని, కళ్లు పీకడంతో తీవ్ర గాయాలు అయ్యాయని, త్వరలో నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it