అభం శుభం తెలియని చిన్నారిపై కామంతో రెచ్చిపోయాడు. అక్క ఇంట్లోనే ఉంటూ ఆమె కూతురుపైనే కన్నేశాడు. చివకు అక్కా, బావ బయటకు వెళ్లిన సమయంలో కూతురిపై అత్యాచారం చేశాడు. తమ్ముడే నా కూతురిపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడా.. అంటూ తల్లి షాక్‌కు గురైంది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పరిధిలో చోటు చేసుకుంది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

మేఘానినగర్‌కు చెందిన ఓ దంపతులకు పదేళ్ల కూతురు ఉంది. అయితే బాలికకు మేనమామ వరసయ్యే 17 ఏళ్ల బాలుడు అక్కాబావతో కలిసి ఇంట్లో ఉంటున్నాడు. చూడడానికి తక్కువ వయసున్నా.. అక్క కూతురిపైనే కన్నేశాడు ఈ కామాంధుడు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంట్లో ఉండటంతో ఎలాగైనా బాలికపై అఘాయిత్యానికి పాల్పడాలని సమయం కోసం ఎదురు చూశాడు ఈ నీచుడు. ఇంతలోనే అక్కా బావ పనిమీద బయటకు వెళ్లారు. ఎంకేముంది సమయం దొరికిందని భావించి ఒంటరిగా ఉన్న బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని, ఒక వేళ చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఇక తల్లి ఇంటికి వచ్చిన తర్వాత కూతురు గజగజ వణుకుతూ ఏడుస్తూ తల్లితో జరిగిన విషయం తెలిపింది. విషయం విన్న తర్వాత తల్లికి మతిపోయినట్లయింది. తమ్ముడే  కూతురుపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంపై షాక్‌కు గురైంది. విషయం భర్తతో చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు బాలుడుని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మైనర్‌ కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.