అందరూ లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు..ఆ ఒక్క సీఎం తప్ప..

By రాణి  Published on  11 April 2020 2:31 PM GMT
అందరూ లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు..ఆ ఒక్క సీఎం తప్ప..

భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయ్. శనివారం ఒక్కరోజే 1000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గుచూపుతుందన్న విషయం దాదాపు ఖాయమైంది. ఈ విషయం పై నరేంద్రమోదీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా..శనివారం రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రజల మనోభావాలు, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు.

Also Read : అలా చేస్తే ఇంటి యజమానులపై చర్యలు తీసుకోండి : ఏపీ హై కోర్టు

ఈ సందర్భంగా వైరస్ ను పూర్తిగా సమాధి చేయాలంటే లాక్ డౌన్ ను పొడిగించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని మోదీ పేర్కొన్నారు. దీనిపై రెండు రాష్ట్రాల సీఎంలు మినహా మిగతావారందరూ సుముఖత చూపారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేవలం రెడ్ జోన్లుగా గుర్తించిన ఊర్లు మినహా మిగతా చోట్ల లాక్ డౌన్ కు మినహాయింపు ఇచ్చి..ప్రజా రవాణాకు అనుమతివ్వాల్సిందిగా కోరారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం లాక్ డౌన్ పొడిగింపుపై పూర్తి విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒడిషా, పంజాబ్ సీఎంలు ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలు చేశారు.

Also Read : 204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ద.మ. రైల్వే

కాగా..లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా ప్రబలుతుందన్న భయం, లాక్ డౌన్ కంటిన్యూ చేస్తే మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతామన్న భయం ప్రజా నాయకులతో పాటు, ప్రజలను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం పోవడంతో దేశంలో నిరుద్యోగుల శాతం పెరిగింది. ఇంకా నిరుద్యోగం పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో లాక్ డౌన్ పొడిగింపా ? ఎత్తివేత ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story