ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధుసూదన్ రెడ్డి అరెస్టు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 5 Oct 2019 5:01 PM IST

హైదరాబాద్: తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నిన్నటి నుండి మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఏకకాలంలో మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మధుసూదన్ రెడ్డి అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాగా మధుసూదన్ రెడ్డి అక్రమ ఆస్తులు 40 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది.
Next Story