శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వచ్చిన చిత్రం ‘మధ’. ఏకంగా 26 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కొంతమంది సైటిస్ట్ ల తమ ప్రయోగంతో హ్యూమిడిటి ఎక్కువ ఉండేలా నిషా (త్రిష్నా ముఖర్జీ)ని పుట్టిస్తారు. దాంతో ఆమెను డ్రగ్ గాని, వైన్ గాని ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేవు, అయితే ఒక బ్లాస్ట్ కారణంగా నిషా అనాధగా మారుతుంది. కానీ ఒంటరిగానే పెరిగి పెద్దయ్యి ఆమె జాబ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే అర్జున్ (రాహుల్) ఆమె లైఫ్ లోకి చీట్ చెయ్యడానికి కావాలని ఎంటర్ అవుతాడు. నిషాను ప్రేమలో దించి మానసికంగా ఆమెను వీక్ చేసి అందరూ ముందు నిషాను పిచ్చిదానిగా క్రియేట్ చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం నిషా ఒక మెడికిల్ మాఫీయా చేతుల్లో చిక్కుకుంటుంది. ఆమె పై డ్రగ్స్ ప్రయోగం చేస్తుంటారు. రవి వర్మ అనే వ్యక్తి ఇదంతా చేస్తుంటాడు. అతనికి నిషాకి ఉన్న సంబంధం ఏమిటి ? అసలు అర్జున్ ఎవరు ? అతను నిషానే ఎందుకు టార్గెట్ చేశాడు ? ఇంతకీ అతను మంచివాడా ? చెడ్డవాడా ? వాళ్ళందరూ నిషానే ఎందుకు టార్గెట్ చేశారు ? ఫైనల్ గా నిషా కథ ఎలా ముగుస్తోంది ? అనేది మిగతా కథ.

నటీనటులు :

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రధాన పాత్ర త్రిష్నా ముఖర్జీ నటించిన నిషా పాత్ర. కథ మొత్తం నిషా చుట్టే తిరుగుతుంది. అలాంటి నిషా పాత్రలో త్రిష్నా ముఖర్జీ అద్భుతంగా నటించింది. ఒకే పాత్రలో భిన్నమైన భావోద్వేగాలు పండించి తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె పై డ్రగ్స్ ప్రయోగం చేసినప్పుడు ఆమె పలికించిన హావభావాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే హీరోగా నటించిన రాహుల్ కూడా తన నటనతో బాగా మెప్పించాడు. లుక్స్ పరంగా పెర్ఫామెన్స్ పరంగా రాహుల్ తన మార్క్ చూపించాడు. నిషాతో ప్రేమలో పడే సన్నివేశాల్లో మరియు ప్రేమించిన అంమ్మాయి కోసం బాధ పడే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో(క్లైమాక్స్ ) ఆయన ఆకట్టుకుంటుంది. ఇక ఇతర పాత్రల్లో కనిపించిననటీనటులు తమ నటనతో ప్రేక్షకులని మెప్పిస్తారు. ముఖ్యంగా రవివర్మ పాత్రలో నటించిన అనిల్ చాలా బాగా నటించారు. అయితే కథకే కీలక పాత్ర అయిన నిషా పాత్ర గురించి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. చివర్లో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ పాత్ర అలా ఉండటానికి సంఘనటల రూపంలో ఉండి ఉంటే బాగుండేది. ఏమైనా నిషాగా త్రిష్నా ముఖర్జీ అద్భుతంగా నటించింది.

సాంకేతిక విభాగం :

శ్రీవిద్య రచయితగా దర్శకురాలిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కానీ ఆమె రాసుకున్న కథ మరియి హీరోయిన్ పాత్రే ఈ సినిమాకు ప్రధాన బలం. పైగా ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చింది. అలాగే సినిమా క్వాలిటీ పరంగా కూడా ఆమె టాలెంట్ ను మెచ్చుకోవాలి. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. సినిమా విజువల్ గా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. కెమెరామెన్ అభిరాజ్ నాయ‌ర్‌ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. ఇక రంజిత్ ట‌చ్‌రివ‌ర్‌ ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో కథకు అక్కర్లేని సీన్స్ ను తొలిగించి ఉంటే బాగుండేది . సినిమాలోని నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఇక ఈ సినిమాలో చెప్పాలనుకున్న క్యారేకరైజేషన్స్ మరియు మెయిన్ థీమ్ తో పాటుగా కొన్ని సప్సెన్స్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శక రచయిత రెండువ భాగం కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా రెండువ భాగంలో ఉత్సుకతను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నప్పటికీ సింపుల్ గానే కథనాన్ని నడపడం అంతగా రుచించదు. మొదటి భాగం మెయిన్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సస్పెన్స్ ను బాగా మెయిటైన్ చేసి.. సెకెండాఫ్ లో ఒక్కసారిగా కథను డైవర్ట్ చేయడంతో సినిమా కొంత ట్రాక్ తప్పుతుంది. బట్ ఓవరాల్ గా మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

నటీనటుల నటన

ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ

కొన్ని సప్సెన్స్ సీన్స్

డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :

ప్లే బోర్ గా సాగడం,

అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు

చివరగా :

శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సప్సెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల్లకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది. అయితే ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు, అక్కడకడ వర్కౌట్ కాని సీన్స్ సినిమాలో బలహీనతలుగా మిగులుతాయి. మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారితో పాటు కమర్షియల్ చిత్రాలు ఇష్టపడేవారికి కూడా ఈ చిత్రం మంచి చాయిస్ అని చెప్పొచ్చు.

rating : 3/ 5

 

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort