జ‌గ‌న్‌తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Dec 2019 1:00 PM GMT
జ‌గ‌న్‌తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే..!

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ మద్దాలి గిరిధర్ రావు సీఎం వైఎస్‌ జగన్‌తో భూటీ అయ్యారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు.. గిరిధర్ రావు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. రాజ‌ధాని ఉద్య‌మం జ‌రుగుతున్న నేఫ‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్ రావు సీఎం జ‌గ‌న్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలావుంటే.. కొద్ది రోజుల క్రిత‌మే గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ వల్లభనేని వంశీ జ‌గ‌న్‌తో భేలీ అయ్యారు. అప్ప‌టి నుండి వంశీ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇక‌ శాసనసభలో కూడా వంశీ.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో మరో టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్‌ను కలవడం టీడీపీ వ‌ర్గాల‌ను అయోమ‌యానికి గురిచేసింది.

Next Story
Share it