రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త

By సుభాష్
Published on : 17 May 2020 10:16 PM IST

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త

చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించరు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరైన నిద్రపోవాలని, లేకపోతే ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో బాధపడటం తప్పదని సూచిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఎక్కువగా రాత్రిపూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. అందుకే రాత్రి 9 గంటల లోపే భోజనం చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల డయాబెటిస్‌ -2, గుండె జబ్బులు తప్పవంటున్నారు. అందుకే పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని సూచిస్తున్నారు.

భోజనం విషయంలో సరైన సమయాలు పాటించాలని, లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు.

Next Story