మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రిటీగా కనికా..పోలీస్ శాఖ నుంచి నోటీసులు

By రాణి  Published on  27 April 2020 8:10 PM IST
మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రిటీగా కనికా..పోలీస్ శాఖ నుంచి నోటీసులు

భారతదేశంలో కరోనా విజృంభిస్తోన్న తొలి రోజుల్లో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు వైరస్ పాజిటివ్ రావడం సంచలనం రేపింది. అప్పట్లో లండన్ నుంచి తిరిగి భారత్ కు వచ్చాక కనికా వివిధ పార్టీల్లో పాల్గొని వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కనికా 21 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందాక 6వ సారి వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దాంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక కనికా..తాను క్వారంటైన్ లో ఉండగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఓ లేఖను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఆ మర్నాడే కనికాకు షాక్ ఇస్తూ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు.

Also Read : ఆది, వర్షిణిల మధ్య ఎఫైర్ నిజమేనా ?

కనికా కు వైరస్ లక్షణాలున్న సమయంలో ఆమె బహిరంగంగా పార్టీలకు హాజరై వైరస్ వ్యాప్తి చెందేందుకు కారణమైందని లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కనికా పై ఐపీసీ సెక్షన్ 269, 270 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు కనికా విచారణకు హాజరు కావాల్సి ఉందంటూ లక్నో కృష్ణానగర్ ఏసీపీ దీపక్ కుమార్ సింగ్ నోటీసులు పంపారు. విచారణలో కనికా చెప్పే సమాధానాలను బట్టి ఆమెపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read : పిడుగుపాటుకు నవ వరుడు సహా ఐదుగురు మృతి

కాగా..భారత్ లో కరోనా సోకిన తొలి సెలబ్రిటి కనికా కపూర్ అనే చెప్పొచ్చు. బాలీవుడ్ సింగర్ కి కరోనా పాజిటివ్ అంటూ మార్చి 21వ తేదీ నుంచి వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది కనికా గురించి తెలుసుకునేందుకు సెర్చ్ ఇంజన్ లో తెగ వెతికేశారు. నిజానికి ఈ విషయంలో మాత్రం కనికా కొత్త రికార్డులను సృష్టించింది.

Next Story