ఆది, వర్షిణిల మధ్య ఎఫైర్ నిజమేనా ?

By రాణి  Published on  27 April 2020 1:38 PM GMT
ఆది, వర్షిణిల మధ్య ఎఫైర్ నిజమేనా ?

ఢీ..ఈ డ్యాన్స్ షో సీజన్ల గురించి తెలియనివారు చాలా తక్కువే ఉంటారు. సీజన్ మొదట్లో జడ్జిలు, యాంకర్, కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్స్ వరకే పరిమితమైన ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో మెల్లమెల్లగా మెంటర్స్ జోడిల వరకూ వచ్చింది. ముఖ్యంగా ప్రదీప్ ఈ షో కి యాంకర్ గా వ్యవహరించడం మొదలు పెట్టాక టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగింది. ఆ తర్వాత రవి, లాస్య టీమ్ మెంటర్స్ గా వచ్చాక ఢీ అంటే ఢీ అంటూ పోటా పోటీగా సాగాయి ఢీ సీజన్లు. కొన్నాళ్లకి ఆ స్థానంలో సుధీర్, రష్మి వచ్చారు. ఈ జోడీ మధ్య ఉండే కెమిస్ట్రీకి అంతా ఫిదా. చూసేవాళ్లు నిజంగానే వీళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకుంటారు.

Also Read : లాక్ డౌన్ లో ప్రసవ వేదన..ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..

ఢీ షో లో సుధీర్ ని రష్మీ, ప్రదీప్ కలిసి చేసే టీజింగ్, స్కిట్లతో ప్రేక్షకులను అలరిస్తారు. రెండు సీజన్ల నుంచి జోడి మెంటర్స్ వస్తున్నారు. ఈ సీజన్ లో రష్మీ-సుధీర్ జోడి అయితే..ఆపోజిట్ లో ఆది - వర్షిణి జోడి పోటీలో ఉన్నారు. ఆన్ స్క్రీన్ పై సుధీర్ - రష్మీ లను మించిపోతున్నారు హైపర్ ఆది - వర్షిణి. స్టేజీ పై వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసిన వారంతా ఇన్నాళ్లు సుధీర్ - రష్మీ నే అనుకున్నాం..కానీ ఇప్పుడు వీళ్లు కూడా ప్రేమించుకుంటున్నారనమాట. అందుకే అంత చనువుగా ఉంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో అయితే ఆ మాటలన్నీ నిజమేనేమో అనిపిస్తుంటాయి.

Also Read : లాక్ డౌన్ ఎఫెక్ట్ : నడిరోడ్డుపైనే నమాజ్

ఇలా ఆది - వర్షిణి ల మధ్య ఎఫైర్ ఉందని, వారిద్దరూ ప్రేమలో ఉన్నారని వస్తున్న రూమర్స్ పై ఇటీవలే ఆది ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. నాకు, వర్షిణి కి మధ్య ఉన్నది స్నేహమే తప్ప మరే ఉద్దేశం లేదని తేల్చేశారు. సుధీర్ - రష్మికి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇలా చేయక తప్పదు కాబట్టే చేస్తున్నామన్నారు.

వర్షిణి కూడా కొద్దిరోజుల క్రితం లైవ్ చాట్ లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. మేడమ్ మీకు, ఆది కి మధ్య ఎఫైర్ ఉందని వస్తున్న రూమర్స్ అన్నీ నిజమేనా ? అని అడుగగా..వర్షిణి దానిపై స్పందించింది. ఆన్ స్క్రీన్ పై సుధీర్ రష్మీ చేస్తున్న ఫెర్ఫార్మెన్స్ కు చాలా క్రేజ్ ఉంది. వాళ్లు ఎక్కడికెళ్లినా ఆ క్రేజ్ అలాగే ఉంటుంది. అలాంటి వారికి పోటీగా నిలబడిన మాకు కూడా అంతే క్రేజ్ రావాలన్నది షో డిమాండ్. అందుకే అంత కెమిస్ట్రీ పండించక తప్పట్లేదని చెప్పుకొచ్చింది.

Also Read : ఎరక్కపోయి వచ్చాడు..ఇరుక్కుపోయాడు..

Next Story