లాక్ డౌన్ లో ప్రసవ వేదన..ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..

By రాణి  Published on  27 April 2020 11:08 AM GMT
లాక్ డౌన్ లో ప్రసవ వేదన..ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..

లాక్ డౌన్ సమయంలో ఎందరో గర్భిణులు పడుతున్న ప్రసవ వేదన అంతా ఇంతా కాదు. ఆస్పత్రికి వెళ్లే దారి ఉన్నా సమయానికి అంబులెన్స్ దొరక్క కొందరు ఇబ్బంది పడుతుంటే..వాహన ఏర్పాటు ఉండి అది ఇంటికి రాలేని పరిస్థితుల్లో మరికొందరు గర్భిణులు నరకం చూస్తున్నారు. అత్యవసర సేవలకోసం అంబులెన్స్ లు, అధికారులు వెంటనే స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాలైతే చెప్పాయి కానీ..బయట పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఓ గర్భిణీ నడిరోడ్డుపైనే ప్రసవించగా..మరో గర్భిణీకి ప్రవసం అయ్యాక తీవ్రరక్తస్రావంతో మరణించింది.

Also Read : లాక్ డౌన్ ఎఫెక్ట్ : నడిరోడ్డుపైనే నమాజ్

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ని కొత్తూరు మండలంలో గర్భిణీకి డెలివరీ సమయం దగ్గరకొచ్చింది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి. అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. వారి ఊరిలో ఉన్న ఏ చిన్న ఆటోనో పట్టుకుని వెళ్దామన్నా రహదారి లేదు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా కు ఒరిస్సాకు సరిహద్దు గ్రామం అది. ఆల్తి గ్రామం సరిహద్దు కావడంతో ఒరిస్సా అధికారులు అట్నుంచి ఎవరూ రాకుండా లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్డును తవ్వేశారు. ఆ గుంతలోకి దిగి నడిచి వెళ్లడమూ కష్టమే. దీంతో గర్భిణీ అయిన వాణిశ్రీని కుటుంబ సభ్యులు ఓ కర్రకు మధ్యలో ఊయల కట్టి అందులో కూర్చోబెట్టి (డోలి) తమ భుజాలపై మోసుకుంటూ రోడ్డు దాటించి ఆటోలో ఎక్కించారు.

Also Read : ఎరక్కపోయి వచ్చాడు..ఇరుక్కుపోయాడు..

దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కాబట్టి సరిపోయింది. అదే సమయంలో మహిళకు ఏ మాత్రం నొప్పులొచ్చినా వేరేరకంగా ఉండేది. అది ఊహించడానికే ఘోరంగా ఉంటుంది. అందుకే ఇలాంటి గర్భిణీలను తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుందని, వెంటనే కొత్తూరు మండల ఎండిఓ, ఆర్డీఓ ఒరిస్సా అధికారులతో మాట్లాడి తవ్విన రోడ్డును పూడ్చివేయించాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి మరే మహిళకు రాకుండా చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it