లాక్ డౌన్ ఎఫెక్ట్ : నడిరోడ్డుపైనే నమాజ్

By రాణి  Published on  27 April 2020 8:55 AM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ : నడిరోడ్డుపైనే నమాజ్

నెలరోజులకు పై నుంచే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లోనే ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు అయిపోయాయి. ప్రార్థనా మందిరాలన్నీ మూసివేయడంతో ఈ నాలుగు పండుగల్ని ప్రజలు ఇంట్లోనే జరుపుకున్నారు. ఇప్పుటు అతి పవిత్రమైన రంజాన్ మాసం కూడా మొదలైంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ముస్లిం సోదరులు రంజాన్ మాస ఉపవాస దీక్షలను మొదలుపెట్టారు. మే 23లేదా 24 తేదీల్లో రంజాన్ పండుగ. ఏటా రంజాన్ ఉపవాస దీక్షల్లో ముస్లిం సోదరులు మూడు పూటలా మసీదుల్లో ప్రార్థనలు జరుపుతారు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల ఆ అవకాశం లేదు. మత పెద్దలు సైతం ఇళ్లలోనే నమాజ్ లు చేసుకోవాలని, దయచేసి మసీదులకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక బహిరంగంగా ఇఫ్తార్ విందులూ లేవు.

Also Read : ఎరక్కపోయి వచ్చాడు..ఇరుక్కుపోయాడు..

లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే నమాజ్ లు చేస్తున్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, పోలీసులు, ఇతర సిబ్బంది తామున్న ప్రదేశంలోనే నమాజ్ లు చేసుకుంటున్నారు. డాక్టర్లు ఆస్పత్రుల్లో..పోలీసులు ఆయా చెక్ పోస్ట్ ల వద్ద అల్లాను ప్రార్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఓ ట్రాఫిక్ పోలీస్ నడిరోడ్డుపై నమాజ్ చేస్తూ ఓ కెమెరాకు చిక్కారు. గుంటూరు జిల్లాలో ఏఎస్ఐ గా పనిచేస్తున్న కరీముల్లా ఆదివారం విధులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు కనీసం ఇంటికైనా వెళ్లకుండా ఎర్రటి ఎండలో నమాజ్ చేస్తున్నారు ఆయన. ఇది కదా అసలు విధుల పట్ల ఉండాల్సిన నిబద్ధత..దైవం పట్ల ఉండాల్సిన భక్తి అంటే. ఈ ఫొటోచూసిన వారెవరైనా ఆ పోలీస్ కు సలాం చేయకుండా ఉండలేకపోతున్నారు.

Also Read : కరోనా నెగిటివ్ అని ఇంటికి పంపేశారు..మళ్లీ పాజిటివ్ వచ్చిందంటూ..

Next Story
Share it