సామాన్యుడి నెత్తిన మరో గుదిబండ: పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

By సుభాష్  Published on  1 Jun 2020 12:59 PM IST
సామాన్యుడి నెత్తిన మరో గుదిబండ: పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

దేశంలో సామాన్యుడి నెత్తిన మరో గుదిబండ పడింది. దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగాయి. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై సోమవారం మెట్రో నగరాల్లో రూ. 37 వరకు పెరిగింది. ఇటీవల భారీగా తగ్గిన సిలిండర్‌ ధర ఇప్పుడు పెరిగింది. కొన్ని నెలల పాటు తగ్గుతూ వచ్చిన సిలిండర్‌ ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరగడం మొదలైంది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయి.

దేశ వ్యాప్తంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు ఇలా..

మెట్రో నగరాల్లో : రూ. 37

ఢిల్లీలో : 11.50

ముంబైలో : 11.50

కోల్‌కతాలో : 31.50

చెన్నైలో : 37

అయితే ప్రస్తుతం 14.2కిలోల సబ్సిడీ సిలిండర్‌ ధర ఢిల్లీలో 11.50 పెరిగినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. ఇక కోల్‌కతాలో రూ.31.50, చెన్నైలో రూ.37, ముంబైలో 11.30 పెరిగింది.

ఇక 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర ఢిల్లీలో నిన్నటి వరకూ రూ.581.50 ఉండగా, తాజాగా పెరిగిన ధరతో రూ.593కు ఎగబాకింది. అలాగే కోల్‌కతాలో నిన్నటి వరకూ రూ.584.50 ఉంగడా, ఇప్పుడు పెరిగిన ధరతో రూ.616కు చేరింది. ముంబై రూ. 579 ఉంగడా, తాజాగా పెరిగిన ధరతో రూ. 590 ఉంది, అలాగే చెన్నైలో నిన్నటి వరకూ రూ. 569.50 ఉండగా, తాజాగా పెరిగిన ధరతో రూ. 606.50కి చేరిందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

Next Story