నాగర్‌ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఊరి చివరలో ఉన్న ఒకే చెట్టుకు ఓ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బల్మూర్‌ మండలం బిల్లికల్లు ప్రాంతంలో ఒకే చెట్టుకు ఓ ప్రేమ జంట ఉరివేసుకుంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతుల్లో అమ్మాయిది బిల్లకల్లు గ్రామం కాగా, అబ్బాయి చెంచు గూడెంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. సాయంత్రం సమయంలో ఇద్దరు బైక్‌ పై అటవీ ప్రాంతానికి వచ్చిన ప్రేమ జంట.. పొద్దుపోయిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్

.

Next Story