మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య
By రాణి Published on 18 April 2020 11:48 AM ISTగుంటూరుకు చెందిన ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. చదువు పూర్తయ్యాక ఇద్దరు వేర్వేరు ఉద్యోగాల్లో చేరారు. యువతి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, యువకుడు ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడటంతో తమకు పెళ్లి చేయాల్సిందిగా ఇరు కుటుంబాల పెద్దలను కోరారు. వారు ససేమిరా అనడంతో..యువతి రెండ్రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పీఎస్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బ్రాడీపేటలో ఉన్నట్లు గుర్తించారు.
Also Read : ఇండియన్ నావీలో కరోనా కలకలం..26 మందికి పాజిటివ్
లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్లి చూడగా ప్రేమికులు విగతజీవులై కనిపించారు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Also Read :లాక్‌డౌన్ వేళ దారుణం : మహిళా బ్యాంక్ మేనేజర్‌పై అత్యాచారం